నిజంనిప్పులాంటిది

Apr 07 2024, 17:21

సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

గంజాయి రవాణాపై పోలీ సులు ఉక్కుపాదం మోపు తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు.

తాజాగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 32 కేజీల గంజాయిని మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి కు చెందిన బానోతు లక్ష్మణ్‌ అనే యువకుడు ఏపీ నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తు న్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మణ్‌పై ఎన్‌డీపీఎస్‌ యాక్టు, NDPS,కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

నిజంనిప్పులాంటిది

Apr 07 2024, 17:19

కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే

భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈరోజు ఉదయం కాంగ్రెస్‌ లో చేరారు.

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

ఆయనతో పాటు పలువురు అనుచరులు కాంగ్రెస్‌లో చేరారు.

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Apr 07 2024, 10:27

ప్రధాని నరేంద్ర మోడీ నేడు బీహార్ పర్యటన

పీఎం మోదీ ఇవాళ బీహార్ లో పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూ ర్ కు మద్దుతుగా ప్రచారం చేయనున్నారు. అలాగే నవాడాలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించ నున్నారు.

నవాడా జనసభలో బీజేపీ నేతలతో పాటు ఎన్డీయే కూటమిలోని ఇతర భాగ స్వామ్య పార్టీల సభ్యులు కూడా పాల్గొంటారు. అయితే, బీహార్ లో వారం రోజుల వ్యవధిలో రెండవ సారి ప్రధాని ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్నారు.

అంతకు ముందు.. ఏప్రిల్ 4వ తేదీన జాముయి స్థానం నుంచి ఎన్డీయే తరపున లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మోడీ ప్రారంభించారు. ఇక, నవాడాలో ప్రధాని మోడీ కార్యక్రమం దృష్ట్యా పటిష్ట మైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మొదటి దశ లోక్ సభ ఎన్ని కలలో భాగంగా ఏప్రిల్ 19వ తేదీన గయా, ఔరం గాబాద్, జాముయితో పాటు నవాడా లోక్ సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.

నిజంనిప్పులాంటిది

Apr 07 2024, 10:26

గన్‌ మిస్‌ఫైర్‌.. ఆర్‌,ఎస్‌ఐ బాలేశ్వర్ అనుమానాస్పద మృతి

హైదరాబాద్ నగరంలోని ఓల్డ్‌ సిటీలోఈరోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది. గన్‌ మిస్‌ఫైర్ అయి ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ విషాదకర సంఘటన ఓల్డ్‌సిటీలోని ఖబూతర్‌ ఖానా పోలీస్‌ పికెట్ దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్‌ విధులు నిర్వహి స్తున్న సమయంలో ప్రమాద వశాత్తు గన్‌ మిస్‌ ఫైర్‌ అయ్యిందా? తుపాకితో కాల్చుకున్నాడా? తెలియవలసి ఉంది

దీంతో ఆయన సంఘటన స్థలంలోనే మృతి చెందారు. గతంలో ఇదే పికెట్‌లో గన్‌ మిస్‌ఫైర్ అయి కానిస్టేబుల్‌ మృతి చెందాడు. బాలేశ్వర్‌ మృతితో పోలీస్‌ శాఖలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

నిజంనిప్పులాంటిది

Apr 07 2024, 10:24

9వ తరగతి బాలికను గర్భవతిని చేసిన యువకుడు

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి బాలికను ఓ యువకుడు గర్భవతి చేశాడు.

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ లో 9వ తరగతి చదువు తున్న బాలికను అదేగ్రా మానికి చెందిన యువకుడు పరిచయం అయ్యాడు.

తనను రోజూ కలిసేవాడు. మాయమాటలు చెబుతూ బాలికను మెల్లిగా తనవైపు మలుచుకున్నాడు. బాలిక ను మాటలతో మభ్యపెట్టా డు. రోజూ ఓ ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు..

అయితే కొన్ని నెల తరువా త బాలిక గర్భవతి అని తేలింది. దీంతో బాలికను కలిస్తే మళ్లీ తనను ఏం చేస్తారో అనేభయంతో యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురు ఏదో కోల్పోయినట్లు ఉడటంతో తల్లిదండ్రులు నిలదీశారు.

దీంతో బాలిక శనివారం అసలు విషయం చెప్పడం తో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగి పోయారు. వెంటనే పోలీస్ స్టేషన్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యువకుడి కోసం గాలిస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 07 2024, 10:23

కోహ్లీ సెంచరీ వృధా: రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో మరో విజయం

ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయ‌ల్స్ వ‌రుస విజ‌యా ల‌తో దూసుకుపొతుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ మ‌రో విజయం సాధించింది.

ఇప్పటివరకు నాలుగు మ్యా చ్‌లు ఆడగా.. అన్నింటిలో నూ గెలిచి మరోసారి టెబుల్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగ ళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టాని 183 పరుగు లు చేసింది. ఇక చేజింగ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజ‌యం సాధించింది.

ఓపెనర్ జాస్ బట్లర్ 100 నాటౌట్ తో సీజన్‌లో రెండో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.. ఇక కెప్టెన్ సంజు శాంసన్ (69) హాఫ్ సెంచరీలతో ఆర్సీబీ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఆర్సీ బీ బౌలర్లలో రీస్ టాప్లీ రెండు వికెట్లు తీయగా.. యష్ దయాళ్, మహ్మద్ సిరాజ్ చరో వికెట్ దక్కిం చుకున్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 06 2024, 14:37

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్య‌ర్థి గా,నారాయ‌ణ శ్రీ‌గ‌ణేశ్: ప్ర‌క‌టించిన కాంగ్రెస్ హై కమాండ్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేష్‌ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా అనౌన్స్ చేసింది.

ఈ మేరకు శనివారం ఏఐ సీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. గణేష్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ అభ్యర్థిపై అనేక చర్చల అనంతరం చివరకు గణేష్ పేరునే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటో న్మెంట్ స్థానం ఖాళీ అయ్యిం ది.బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ల్యాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చ‌నిపో వ‌డంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.

మే 13న కంటోన్మెంట్ ఉపఎన్నిక జరుగనుంది. ఎన్నికలకు సర్వం సిద్ధమ వుతున్న తరుణంలో ఆయా పార్టీలు కంటోన్మెంట్‌లో పోటీ చేయబోయే అభ్య ర్థుల ఎంపికపై దృష్టి సారిం చాయి.

ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధిం చాలనే ఉద్దేశంతోనే ముందు కు సాగుతోంది. కంటోన్మెంట్‌ లో పోటీ చేయబోయే అభ్య ర్థి ఎంపికపై దృష్టి పెట్టి కాంగ్రె స్.. శ్రీ గణేష్ పేరును అధికా రికంగా ప్రకటించింది.

కంటోన్మెంట్ కోసం కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగొ లు నాలుగుసార్లు సర్వేలు చేయగా.. కంటోన్మెంట్‌లో అరవ మాల సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

శ్రీ గణేష్ అరవ మాల సామాజికవర్గం కావడంతో హస్తం నేతలు అతడి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లేనందున కంటోన్మెంట్ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది...

నిజంనిప్పులాంటిది

Apr 06 2024, 14:35

ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆటో ఢీకొని చిన్నారి మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ కాల‌నీలో ఈరోజు చోటు చేసుకుంది.

ఇంటి ముందు 16 నెలల బాలుడు ఆడుకుంటుండ‌గా తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే ఆటో ఢీకొట్టింది. ఈ ప్ర‌మా దంలో ఆ బాలుడు అక్క‌డి క్క‌డే మృతి చెందాడు.

స్థానిక ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన పొట్ట రిశీంద్ర -అపూ ర్వ దంపతుల కుమారుడైన సుధన్వన్,16 నెలలు,శని వారం ఇంటి ముందు ఆడు కుంటుండగా అటుగా వచ్చి న ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి బాలుడిని ఢీకొట్ట డంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ న్నారు. ఈ ఘటనతో కోరుట్లలో విషాద చాయలు అలుముకున్నాయి...

నిజంనిప్పులాంటిది

Apr 06 2024, 14:33

శ్రీశైలంలో నేటినుండి ఉగాది మహోత్సవాలు

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో ఈరోజు నుండి ఈనెల 10 వరకు ఉగాది మహోత్స వాలు జరగనున్నాయి. 5రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తుల కోసం మంచినీరు, తదితర సౌకర్యాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

ఆలయం ప్రాంగణమంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. లడ్డు ప్రసాదాలు, పెద్ద ఎత్తున అన్న ప్రసాద విత రణ సాంస్కృతిక కార్య క్రమాలు వంటి ఏర్పాట్ల ను ఏర్పాటు చేయడంపై ఈవో పెద్దిరాజు ప్రత్యేక దృష్టి సారించారు.

మహోత్సవాలపై ఇప్పటికే పలు దఫాలుగా సమీక్ష సమావేశాలను నిర్వహిం చారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా 17 భక్త బృందాల సహాయంతో

జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు ఎస్పీ రఘువరన్ రెడ్డి జిల్లా అధి కారుల సహాయ సహాకా రాలతో ఉగాది మహోత్స వాలు విజయవంతం చేసేందుకు ఈవో పెద్దిరాజు ప్రత్యేక దృష్టిని సారించారు.

నిజంనిప్పులాంటిది

Apr 06 2024, 14:32

కాంగ్రెస్‌లో చేరిన పూత‌ల‌ప‌ట్టు ఎమ్మెల్యే

వైసీపీకి పూత‌ల‌ప‌ట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గుడ్‌బై చెప్పారు. శ‌నివారం వైఎస్ ష‌ర్మిల స‌మ‌క్షంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆయనకు షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అయితే, సీఎం జగన్ పూతపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూతిరేకుల సునీల్ కుమార్ ఖరారు చేశారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేను అయిన తనను కాదని..మరో వ్యక్తికి టికెట్ కేటాయించడంతో బాబు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మార్పులు వార్తలు వచ్చినా.. ఇంత కాలం సైలెంట్‌గా ఉన్నారు.

తాజాగా ఇవాళ షర్మిల హామీ మేరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు...